TAM Patrika

Latest Updates :

No News Found.

About us

 

A 501(c) (3) not-for-profit organization (Tax ID: 47-4671680)

"చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా !! గతమెంతొ ఘనకీర్తి కలవోడా !!" అని ఒక మహాకవి రాసారు. ఆ ఘనమయిన కీర్తిని, మన సంప్రదాయాలను మన భావితరాలకు పరిచయం చెయ్యడం మన కర్తవ్యం, బాధ్యత.

మన సంప్రదాయాలు మనల్ని మంచిగా, మనిషిగా తీర్చిదిద్దాయి అని మనకు అనిపిస్తే అవి మన పిల్లలకు సయితం మనం ఇవ్వాల్సిన తప్పనిసరి ఆస్తులుగా మనం భావించాలి.

మనిషి సంఘజీవి అన్న విషయం సత్యం అయితే సంఘంలో జరిగే విషయాలకి ఎంతో కొంత స్పందించడం అనేది మనిషి నైజం కావాలి. ఆలా స్పందించలేనప్పుదు మనిషికి ఇతర చరాలకూ వ్యత్యాసం లేదు.

సంబంధాలు, భాంధవ్యాలు మృగ్యం అయిపోతున్న ఈ కలికాలపు కంప్యూటర్ యుగంలో మన తోటి మనిషి అవసరాల కొరకు మనకు తోచిన రీతిలో సాయం చెయ్యడం మన కనీస బాధ్యత.

సప్త సముద్రాలు దాటి వచ్చిన మనం నిత్యం తలచుకునేది మన ఇంటిని, తల్లిదండ్రులను, మిత్రులను మరియూ ఆప్తులను. వివిధ కారణాల వల్ల తొచిందే తడవుగా మాతృదేశం లోని మన ఇంటికి వెళ్ళడం చాలా కష్టం. అటువంటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని తెలుగు పండుగల సంబరాలు జరుపుతూ తెలుగుదనాన్ని మరిపిస్తూ హృద్యమయిన ఇంటి వాతావరణాన్ని పెంపొందిస్తూ, కొత్త స్నేహితులను పరిచయం చేస్తూ ఉండాలనేది TAM ఆశయాల్లో భాగం.

ఈ ఆలోచనలకు రూపం ఇస్తూ ఆవిర్భవించిందే TAM. మేరీల్యాండ్ రాష్త్రంలోని తెలుగు వారిని ఒక తాటి పైకి తెస్తూ, తెలుగు వారి అవసరాలకు చేయూతనిస్తూ, తెలుగు సంస్కృతిని, భాషను పెంపొందించేందుకు కృషి చేస్తూ, కొత్త ఆలోచనలకు ఊపిరి పోస్తూ ముందుకు సాగడమే TAM లక్ష్యం.

అమెరికాలో చాలా తెలుగు సంస్థలు ఉన్నాయి. మరి TAM తన ఆవిర్భావాన్ని ఎలా సమర్ధించుకుంటుంది అనే ప్రశ్న కొందరికి కలగొచ్చు. TAM ముఖ్య ఉద్దేశం మేరీల్యాండ్ లోని తెలుగు వారికి తోచినంత సహాయపడటం. ఏవన్నా ఇతర జాతీయ స్థాయి సంస్థలు సహాయం చేసే స్థితిలో ఉంటే, మేరీల్యాండ్ లోని తెలుగు వారి అవసరాలు వారి దాకా చేర్చడం TAM ముఖ్య ఉద్ధేశాల్లో భాగం. ఊదాహరణకు అమెరికా లోని తెలుగు వారి పిల్లలకు తెలుగు భాషా పరిఙ్నానాన్ని పంచడానికి పలు సంస్థలు తమ సహాయాన్ని అందిస్తున్నాయి. ఆటువంటి కార్యక్రమాల్లో TAM తెలుగు వారి అవసరాలకు వారధి గా ఉపయోగపడుతుంది.

ఊన్నతమైన ఆశయాలతో పని చేసే క్రుషీవలురయిన బృందం TAM సొంతం. వారి సహాయ సహకారాలతో, నిత్య నూతనమయిన ఆలోచనలతో మేరీల్యాండ్ లోని తెలుగు వారికి సహాయపడే దిశగా తమని తామ తీర్చిదిద్దుకుంటూ, మంచిని ప్రొత్సహిస్తూ, ప్రేమను పంచుతూ ముందుకు సాగటమే TAM అత్యున్నత ఆశయం.

మేరీల్యాండ్ లో TAM కార్యకలాపాల్లో ముఖ్యమయినవి:

  • తెలుగు సంస్కృతి సంప్రదాయాలు కొనసాగిస్తూ పరిరక్షించడం
  • భావి తరాల్లో తెలుగు భాష భాసిల్లడానికి చేయూత నివ్వడం
  • మాతృదేశం లో మనం పుట్టిన గ్రామాలకు సహాయ పడటం
  • మేరీల్యాండ్ లో తెలుగు వారికి ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి కృషి చెయ్యడం

 

ఇట్లు

మీ రాజశేఖర్ చెరుకూరి

  • President Message :

    Venkata Krishna Kukatla
    మాజ శ్రేయస్సు" , "ప్రజా సంబంధాలు" వంటి మాటలు చిన్నప్పుడు జఠిల పదాలుగా అనిపంచేవి. మనం ఫలానా వారికి ఎందుకు సాయం చెయ్యాలి? .. వారు మనకంటే ఆర్థికంగా బాగానే ఉన్నారు కదా అనిపించేది.  కానీ వయసు పెరిగేకొద్దీ వాటి పట్ల అవగాహన ఏర్పడింది. More Info Read More